చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు ఆటగాడు, దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మహీ అద్భుతమైన సారథి అని, అత్యుత్తమ వ్యక్తిత్వం ఉన్న వాడని అన్నాడు. తన కుమారుడు జిబ్రాన్ పెద్ద వాడయ్యాక ధోనీతో గడిపిన సమయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఎంతో సంబరపడతాడని ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాహిర్ చెప్పాడు. గతేడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఓ మ్యాచ్ ముగిశాక మైదానంలోనే ఇమ్రాన్ తాహిర్, షేన్ వాట్సన్ కుమారులతో ధోనీ సరదాగా ఆడుకున్నాడు. పిల్లలిద్దరూ పరుగు పందెం పెట్టుకోగా తాహిర్ కొడుకు జిబ్రాన్‌ను ధోనీ ఎత్తుకొని పరుగెత్తగా జూనియర్ వాట్సన్వెనుబడ్డాడు. ఆ సందర్భాన్ని తాహిర్ ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు.
ధోనీ.. అద్భుతమైన కెప్టెన్, గొప్ప వ్యక్తి: తాహిర్