ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన కవిత

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌లో కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఇక ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కవిత కలిశారు. ఆ తర్వాత కవితను పార్టీ కార్యకర్తలు, ఆమె అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.